Tuesday, September 27, 2011

పోలీసులు-కోటీశ్వరులు

తమిళనాడు పోలీసు శాఖలో పని చేస్తున్న 169 మంది అధికారులలో 20 మంది కోటీశ్వరులు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులే స్వయంగా విడుదల చేసిన తమ ఆస్తి వివరాలలో తెలిపారు. ఆ మేరకు తమిళనాడు వార్తా పత్రిక, కాగిత సంస్థ ఐ.జి. ఏ.కే.విశ్వనాథన్ రూ.15 కోట్ల ఆస్తితో జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. ఈ ఆస్తి తన తల్లి, భార్య ద్వారా సంక్రమించినట్టు ఆయన తెలిపారు. తమిళనాడు అగ్నిమాపక శాఖ డీ.జీ.పీ బోలోనాథ్, సి.బీ.సి.ఐ.డీ అదనపు డీ.జీ.పీ ఆర్.శేఖర్, మరో విభాగం అదనపు డీ.జీ.పీ రాజేంద్రన్ రూ.3 కోట్ల చొప్పున ఆస్తితో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చెన్నై నగర పోలీసు కమిషనరు జే.కే.త్రిపాటి రూ.2 .8   కోట్ల ఆస్తితో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ నలుగురు అధికారులు నెలకు రూ.70 వేల నుంచి రూ.80  వేల వరకు వేతనాలు పొందుతున్నారు. ఈ అధికారులు అంతా తమ ఆస్తిని స్థలం, ఇల్లు అంటూ స్థిరాస్తిగానే ఉంచుకున్నారు. డీ.జీ.పీ బోలోనాథ్ కు డిల్లి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షలాది రూపాయల విలువ చేసే ఇల్లు ఉన్నాయి. సి.బీ.సి.ఐ.డీ అదనపు డీ.జీ.పీ శేఖర్ కు చెన్నై అన్నానగారులో రూ.1 .2 కోట్ల విల్లువ చేసే, మరో విభాగం అదనపు డీ.జీ.పీ రాజేంద్రన్ కు చెన్నై బెసెంట్ నగరులో రూ.75 లక్షల విలువైన ఇల్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ జోన్ ఐ.జీ శివనాంది తనకు ఎలాంటి ఆతులు లేవని తెలిపారు.

No comments: