Tuesday, September 27, 2011

అరియలూరు

2001 వ ఏడాది అప్పటి డీ.ఎం.కే ప్రభుత్వం అరియలూరు జిల్లాని ఏర్పాటు చేసింది. అప్పట్లో పెరంబలూరు జిల్లా నుంచి అరియలూరుని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అన్నా.డీ.ఎం.కే అధికారంలోకి రావటంతో ఆర్ధిక కారణాలు చూపిస్తూ 2002 మార్చి 31 వ తేది ఈ జిల్లాని రద్దు చేస్తూ మునుపటివలె పెరంబలూరులో విలీనం చేశారు. 2006 వ ఏడాది శాసన సభ ఎన్నికల ద్వారా డీ.ఎం.కే అధికారంలోకి రావటంతో మళ్ళీ అరియలూరు జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 2007 నవంబరు 19 వ తేది ప్రభుత్వ ఉత్తర్వు జారీ చెయ్యగా అదే నెల 23 వ తేది నుంచి అరియలూరు జిల్లా కొనసాగింది. పెరంబలూరు జిల్లాలోని అరియలూరు, ఉడయార్ పాలేయం రెవిన్యూ డివిజన్లు, అరియలూరు, ఉదయార్ పాలేయం, సెందురై తాలూకాలను విలీనం చేసి అరియలూరు జిల్లాను ఏర్పాటు చేసారు. ప్రస్తుతం అరియలూరు జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, తాలూకాలు, రెవెన్యూ గ్రామాల వివరాలు...


పరిది                                    1949.31 చదరపు కిలోమీటర్లు

రెవెన్యూ డివిజన్లు              1 . అరియలూరు,  2 . ఉదయార్ పాలేయం

తాలూకాలు                        1 . అరియలూరు,  2 . సెందురై  3 . జయంకొండాన్

యూనియన్లు                     1 . అరియలూరు,   ౨. ఆండిమటం,  3 . సెందురై  4 . తిరుమనుర్  5 . టి.పాలూర్
                                               6 . జయంకొండాన్

ఫిర్కాలు                              15

రెవెన్యూ గ్రామాలు              195

గ్రామ పంచాయితీలు           201

అసెంబ్లీ నియోజకవర్గాలు  1 . అరియలూరు (162)  2 . ఆండిమటం (163) 3 . జయంకొండాన్ (164)

మున్సిపాలిటీలు                  1 . అరియలూరు   2 .  జయంకొండాన్

పట్టణ పంచాయితీలు         1 . ఉదయార్ పాలేయం 2 . వరదరాజన్ పేట్టై
----------------------------------------------------------------------


పోలీస్ స్టేషన్లు                   18

అగ్నిమాపక కేంద్రాలు      4

సిమెంట్ పరిశ్రమలు          8

చక్కెర పరిశ్రమ                  1

కళాశాలలు                        ప్రభుత్వం 1 ,  ప్రయివేటు 2

ఐ.టీ.ఐ                                2

పాటశాలలు                     120

రైల్వే స్టేషన్లు                     అరియలూరు, ఊటకోవిల్, వెల్లూర్, సెందురై, ఆర్. స్. మాదూర్,  ఈచ్చన్ కాడు

నదులు                            కొల్లిడం, మరుదియారు, వెళ్ళారు

పర్యాటక ప్రాంతాలు/ఆలయాలు  గంగైకొండ చోళపురం, వెట్టకుడి పక్షుల శరణాలయం, శ్రీ కలియుగ వరదరాజ
                                                పెరుమాళ్ ఆలయం (ఏలకురిచ్చి), అడిగలమాత ఆలయం (తిరుమలపట్టి)